దేవుడి ఫోటోలతో నిరసన నేరమా? టీడీపీ డిమాండ్ ఉద్దేశం ఏమిటీ?
x

దేవుడి ఫోటోలతో నిరసన నేరమా? టీడీపీ డిమాండ్ ఉద్దేశం ఏమిటీ?

చట్టసభల రూల్స్ ఏమి చెబుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు..


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్)లో శుక్రవారం (ఫిబ్రవరి 20)న YSRCP సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసనకు దిగడం రాష్ట్రంలో తీవ్ర చర్చను రేపింది. Tirumala Tirupati Devasthanams (TTD) లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించినపుడు ఈ ఘటన జరిగింది.

వైసీపీ సభ్యుల తీరును రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో నిరసన తెలపడం "మహాపాతకం"గా అభివర్ణించారు. సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజుకు విజ్ఞప్తి చేశారు. YCP చేసింది తప్పు అని స్పష్టం చేసి, వారితో మాట్లాడతాను అని ఛైర్మన్ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. అయితే వైసీపీ సభ్యులు తామేమీ తప్పు చేయలేదని, దేవుని పేరిట రాజకీయం చేస్తున్నదే టీడీపీ, ఆపార్టీ నాయకులని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో అసలు సభలోకి దేవుడి బొమ్మల్ని తీసుకువెళ్లడం తప్పా, ఒప్పా అనేది ఓసారి పరిశీలిద్దాం.

దేవుడి ఫోటోలతో చట్టసభల్లో నిరసన చేయడం నేరమా?

ఆబ్జెక్టివ్‌గా చూస్తే, లేదు అనే సమాధానం వస్తుంది. ఇది స్ట్రైట్ క్రిమినల్ నేరం కాదు, కానీ అసెంబ్లీ/కౌన్సిల్ రూల్స్ ఉల్లంఘనగా పరిగణించవచ్చు.
AP లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ఆఫ్ ప్రాసీజర్ (Rule 352 మొదలైనవి) ప్రకారం, సభలో ప్లకార్డ్స్, బ్యానర్స్, ఇమేజెస్ ప్రదర్శించడం నిషేధం. ఇది సభా గౌరవ మర్యాదలు, ప్రతిష్టకు (డెకోరమ్, డీసేన్సీ) ఉల్లంఘన కిందికి వస్తుంది. సస్పెన్షన్ లేదా సెన్సార్ వంటి పార్లమెంటరీ శిక్షలు విధించవచ్చు.
మతపరమైన ధోరణి..
రెలిజియస్ (మతపరమైన) చిత్రాలను ఉపయోగించి నిరసన చేయడం Article 25 (ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్) ఉల్లంఘన కాదు గానీ ఇది రెలిజియస్ సెంటిమెంట్స్ ను గాయపరుస్తుందని చెబుతుంది. ఇటువంటి ఆరోపణలు వస్తే IPC సెక్షన్ 295A (రెలిజియస్ ఫీలింగ్స్ అవుట్‌రేజ్) కింద కేసు ఫైల్ చేయవచ్చు. అయితే, ఇండియా కోర్టులు (ఢిల్లీ హైకోర్ట్ 2022 జడ్జ్‌మెంట్) రెలిజియస్ ఇమేజెస్ పబ్లిక్ ప్లేసెస్‌లో డిస్‌ప్లే చేయడం ఆర్టికల్ 25 ఉల్లంఘన కాదని చెప్పాయి, కానీ పాలిటికల్ కాంటెక్స్ట్‌లో ఇది సున్నితమైన సమస్య.
దీనిపై సుమారు 30 ఏళ్లకు పైగా అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టు ఆర్.ఎం. భాష ఏమన్నారంటే.. "భారతీయ చట్టసభలకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని రాతపూర్వకంగా లేకపోవచ్చు గాని ప్లకార్డులు, దేవుడి ఫోటోలు, ఇతరత్రా చిత్రాలు తీసుకువెళ్లాలంటే సభాపతి అనుమతి పొందాలి. సున్నితమైన సమస్య కనుక సభ్యులు సంయమనం పాటించాలి. ఇవాళ జరిగిన సంఘటన తీవ్ర అభ్యంతరకరమైందే. ఏదైనా జరగరానిది జరిగితే ఈ సమస్య మరింత జటిలమై ఉండేది. మార్షల్స్ రాలేదు కనుక సభలో పెనుగులాట తప్పింది. అదే జరిగుంటే పొరపాటున దేవుడి ఫోటో చిరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి.. ఇదే నిరసనను సభ బయట కూడా చేయవచ్చు. అప్పుడు ఎవరూ అడగరు.. ప్రతికూలవశాత్తూ సభలు హుందాతనాన్ని కోల్పోయాయి. సభల వరకైనా డీసెన్సీని పాటించడం అందరి బాధ్యత" అన్నారు.
గతంలో ఏమి జరిగిందంటే...
ఇండియన్ పార్లమెంటులో రెలిజియస్ సింబల్స్ ఉపయోగించి ప్రొటెస్ట్ చేయడం సభా నిబంధనలకు విరుద్ధం. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 2024లో లోక్‌సభలో శివుడు ఫోటో ప్రదర్శించినపుడు స్పీకర్ - సభా రూల్స్ వయోలేషన్‌గా రూలింగ్ ఇచ్చారు. కానీ క్రిమినల్ కేసు కాలేదు. ఇలాంటి ఇతర ఘటనల్లో (హిందూ దేవతల ఫోటోలు దగ్ధం చేయడం వంటి నేరాల్లో) IPC 295A కింద కేసులు ఫైల్ అయ్యాయి. కానీ అవి నిరసనల సందర్భంలో కాదు.
ఈ ఘటనలో, YSRCP సభ్యులు ఫోటోలు ప్రదర్శించారు కానీ డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. కానీ టీడీపీ దీన్ని "దేవుణ్ణి పాలిటిక్స్‌లోకి లాగడం" అని ఆరోపించింది. చైర్మన్ తప్పు అని చెప్పినా, క్రిమినల్ కేసు ఫైల్ అవ్వలేదు. ఇది పార్లమెంటరీ ప్రాసీజర్ ఇష్యూ మాత్రమే.

మరి టీడీపీ డిమాండ్ వెనుక ఉద్దేశం ఏమిటి?

రాజకీయ విశ్లేషకులు గంగా సురేష్ ప్రకారం.. టీడీపీ డిమాండ్ (క్షమాపణలు, కఠిన చర్యలు) వెనుక పాలిటికల్ స్ట్రాటజీ ఉంది – హిందూ సెంటిమెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చూపించడం, YSRCPను "ఆంటీ-హిందూ"గా ప్రొజెక్ట్ చేయడం.
టీడీపీ మంత్రి అనిత మాటల్లో చెప్పాలంటే YCP ప్రొటెస్ట్ TTD పవిత్రను దెబ్బతీయడం, కల్తీ నెయ్యి వ్యవహరంలో హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కంపెనీకి లింక్ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం.
ఈ వ్యవహారంపై సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు నాగేంద్రనాధ్ మాట్లాడుతూ టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. "దేవుడి ఫోటోలను ప్రదర్శించకూడదని ఎక్కడా లేదు. టీడీపీ వాళ్ల అభ్యంతరం హాస్యాస్పదం. చెప్పులు, బూట్లు వేసుకునే కదా చట్టసభల్లో విదేశీ ప్రతినిధులకు ఫోటోలు, ప్రసాదాలు ఇస్తున్నారు? ఢిల్లీలో ప్రధాని మొదలు మంత్రుల వరకు బూట్లతోనే కదా ప్రసాదాలు ఇచ్చేది.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? చట్టసభల్ని ప్రజాదేవాలయాలు అంటున్నప్పుడు ప్రజల కోసం దేవుడి ఫోటోలతో ప్రదర్శన చేస్తే తప్పేంటీ? ఇవన్నీ చూసినపుడు టీటీడీ వాళ్లు చేస్తున్నది కేవలం హంగామా మాత్రమే. సమస్యను డైవర్ట్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది" అని ది ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు.
మొత్తంగా చూసినపుడు ఇందులో రాజకీయ క్రీడ ఉందని సులువుగానే ఊహించవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ- నిబంధనలను తనకు అనుకూలంగా చూపి ఓటర్ల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాయని అర్థమవుతుంది. ఇది రెండు పార్టీల మధ్య రాజకీయ డ్రామా. చట్టసభల డెకోరమ్ మెయింటైన్ చేయడం ముఖ్యం, కానీ మత సెంటిమెంట్లను పాలిటిక్స్‌లోకి లాగడం సమస్యాత్మకం.
Read More
Next Story