Lokesh and Jagan
x
ఏఐ ఊహాత్మక చిత్రం..

"జగన్ అంత పేదోడేమీ కాదులే లోకేష్"

క్రికెట్ టికెట్లపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు..


ఐసీసీ టీ 20 క్రికెట్ మ్యాచ్ సెగ ఏపీ రాజకీయాలను తాకింది. "స్టేడియానికి వస్తానంటే టికెట్ కొనిస్తా!" అని జగన్ ను ఉద్దేశించి నారా లాకేష్ చేసిన కామెంట్ పై సెటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో హీటెక్కుతున్న వైసీపీ, టీడీపీ వార్ మొదలైంది. మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు అసెంబ్లీ లాబీల్లో, ఇటు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు, హెరిటేజ్ వివాదం, క్రికెట్ మ్యాచ్‌ల చుట్టూ ఈ చర్చ సాగుతోంది.
హెరిటేజ్ వర్సెస్ సాక్షి.. లోకేష్ సవాల్!
అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన లోకేష్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్ సంస్థలు ఏకంగా రూ.1000 కోట్ల మేర ప్రభుత్వ లబ్ధి పొందాయని లోకేష్ ఆరోపించారు.
"హెరిటేజ్ సంస్థ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సెబీకి ఫిర్యాదు చేసినా మాపై ఎలాంటి ఆరోపణలు నిలవలేదు" అని లోకేష్ స్పష్టం చేశారు.
నెయ్యి ధరపై లాజిక్.. బొత్సకు చురకలు!
తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై స్పందిస్తూ, కిలో నెయ్యి రూ. 360కి ఎక్కడ దొరికినా అది కల్తీయేనని బొత్స తేల్చి చెప్పారు. మార్కెట్ ధర రూ. 1000కి పైగా ఉంటే, అంత తక్కువకు ఇచ్చేది కచ్చితంగా నాణ్యత లేనిదేనని లాజిక్ తీశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇందాపూర్ డెయిరీ - హెరిటేజ్ మధ్య సంబంధం ఉందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, "కో-కంపెనీ అనేదే ఉండదు, ఆ విషయం బొత్సకు తెలియదా?" అని ఎద్దేవా చేశారు.
జగన్ అంత పేదోడేమీ కాదు.. స్టేడియం టికెట్ ఆఫర్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానాంశం జగన్ క్రికెట్ మ్యాచ్ చూడటంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలే. "మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వెళ్లాలా అని జగన్ అంటున్నారు. ఒకవేళ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్తే నేను తప్పకుండా వెళ్తాను. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే (జగన్) కూడా వస్తానంటే ఆయనకు నేనే టికెట్ కొనిస్తాను" అని లోకేష్ సెటైర్ వేశారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ స్పందిస్తూ.. "జగన్ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, లోకేష్ ఇలాంటి చిల్లర సెటైర్లు వేయడం ఏంటి?" అని మండిపడుతోంది. దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు "జగన్ అంత పేదోడేమీ కాదులే లోకేష్, ఆయన సొంతంగానే స్టేడియం కొనగలరు" అంటూ వ్యంగ్యంగా రీ-ట్వీట్లు చేస్తున్నారు.

మండలిలో వైసీపీ సభ్యులు బడ్జెట్‌పై చర్చ కాకుండా తిరుపతి లడ్డూ పై చర్చకు రావాలని సవాల్ చేయడం పట్ల లోకేష్ విస్మయం వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా సభను అడ్డుకుని, ఇప్పుడు చర్చ కావాలనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.
మొత్తం మీద లోకేష్ చేసిన 'టికెట్ ఆఫర్' ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మీమ్స్ మరియు సెటైర్లతో యుద్ధం కొనసాగిస్తున్నారు.
Read More
Next Story