Iran is bleeding
x
Image Curtesy Morning journal

'ఇజ్రాయెల్‌ ధ్వంసం- ఇరాన్ పంతం'

ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 1055కి చేరింది. పుతిన్ అమెరికాకు పరోక్ష హెచ్చరిక


ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 6వ రోజుకు చేరింది. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1045కి చేరినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గల్ఫ్ లోని మరికొన్ని దేశాలకు యుద్ధం పాకినట్టు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేంత వరకు నిద్రపోబోమని ఇరాన్ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా పాలకవర్గంపై ఘాటుగానే స్పందించారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ పన్నాగాన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలన్నారు.

  • మరోపక్క, ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా సెనేట్ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి సర్వాధికారాలు అప్పగిస్తూ తీర్మానించింది..

  • వార్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..


  • అమెరికా సెనెట్ నిర్ణయం: ఇరాన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను అడ్డుకోవడానికి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనెట్ తోసిపుచ్చింది. ఈ విధానపరమైన తీర్మానానికి వ్యతిరేకంగా 53 ఓట్లు, అనుకూలంగా 47 ఓట్లు రావడంతో ఆ తీర్మానం వీగిపోయింది.

  • ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఇరాక్ సరిహద్దుల్లో "ఉగ్రవాద కదలికలు" పెరుగుతున్నాయని హెచ్చరించారు. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించడానికి అమెరికా కుర్దిష్ దళాలతో చర్చలు జరుపుతోందని, వారికి ఆయుధాలు సరఫరా చేసే ప్రయత్నంలో ఉందన్న నివేదికల నేపథ్యంలో.. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • చమురు సరఫరాకు ఆటంకం: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో, గ్లోబల్ ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ముప్పు పొంచి ఉందన్న భయంతో సరుకు రవాణా నౌకలు (Cargo Vessels) ఈ మార్గంలో ప్రయాణించకుండా నిలిపివేశాయి.


  • Live Updates

    • 5 March 2026 6:32 PM IST

      ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేసే వరకు నిద్రపోం: ఇరాన్ హెచ్చరిక

      ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే ఆ దేశంలోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

      అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి తుది వీడ్కోలు కార్యక్రమాల కోసం టెహ్రాన్ గ్రాండ్ మోసల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ మీడియా ప్రకారం సుప్రీం లీడర్‌కు నివాళులర్పించేందుకు మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేలాది మంది సంతాపం తెలిపేందుకు మోసల్లాకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్కడి సంప్రదాయం ప్రకారం ముందుగా వీడ్కోలు కార్యక్రమం, అనంతరం అంతిమ యాత్ర నిర్వహిస్తారు.

      ఇక ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం గమనార్హం. మరోవైపు ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్ వస్తే అతడినీ టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చిన తాజా హెచ్చరిక ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

      ఇదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాల సమాచారం ప్రకారం ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు ప్రారంభించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలు, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఏడు ఆధునిక రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థను ఛేదించి పలుచోట్ల తాకినట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ సముదాయం, బెన్ గురియన్ విమానాశ్రయం కూడా లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపింది.

      ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్‌లో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్లు మోగాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉండొచ్చని ఇరాన్ హెచ్చరించింది.

    • 5 March 2026 5:10 PM IST

      ఇరాన్ లోనూ బందరు పోర్టు

      పేరు కాస్త అటు ఇటుగా ఉంది గాని ఇరాన్ లోనూ బందరు పోర్టు ఉంది. దాని పేరు బందర్ అబ్బాస్ పోర్టు.. ఇప్పుడది భారీ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇదే సమయంలో ఇరాన్‌లోని కీలక సముద్ర వాణిజ్య కేంద్రం అయిన Bandar Abbas పోర్టు ప్రాంతంలో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ పోర్టు Strait of Hormuz కు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ Islamic Revolutionary Guard Corps (IRGC) నేవీకి చెందిన ముఖ్య స్థావరాలు ఉన్నాయి. ఇరాన్‌లోని కీలక సముద్ర వాణిజ్య కేంద్రం అయిన Bandar Abbas పోర్టు ప్రాంతంలో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ పోర్టు Strait of Hormuz కు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ Islamic Revolutionary Guard Corps (IRGC) నేవీకి చెందిన ముఖ్య స్థావరాలు ఉన్నాయి.

      మా నౌకను ముంచారు కదా, భారీ మూల్యం చెల్లించాల్సిందే..

      మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. IRIS Dena అనే ఇరాన్ యుద్ధనౌకపై United States దాడి చేసిన ఘటనపై తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఈ దాడిని Abbas Araghchi తీవ్రంగా ఖండిస్తూ అగ్రరాజ్యానికి తగిన బదులు ఇస్తామని హెచ్చరించారు. ఇరాన్‌కు సుమారు 2000 మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఈ దాడి జరగడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధనౌక ఇటీవల భారతదేశానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దాడి జరిగినట్లు ఆయన గుర్తుచేశారు.

      అమెరికా జలాంతర్గామి దాడితో నౌక మునిగిపోయినప్పుడు అందులో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కొందరిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించగా, పలువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు విదేశీ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై ఇరాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

      పేలుళ్లు IRGC నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నష్టం ఎంత జరిగిందన్న విషయంపై ఇరాన్ అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ ఘటనలు మరింత ఆందోళనకు దారితీస్తున్నాయి.

      విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో అక్కడి భద్రతా పరిస్థితులు దిగజారితే అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

    • 5 March 2026 4:56 PM IST

      యుద్ధం విస్తరించొచ్చన్న పుతిన్

      రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలను అంతర్జాతీయ రాజకీయాల కోణంలో చూస్తే  తీవ్ర హెచ్చరికలుగానే పరిగణించాలి. పుతిన్ వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపించిన అంశం మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించే ప్రమాదం.

      అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు ప్రాంతీయ దేశాలను కూడా ఈ సంక్షోభంలోకి లాగవచ్చని రష్యా భావిస్తోంది. ఇది ప్రపంచ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది.

      అమెరికాపై పరోక్ష విమర్శ

      పుతిన్ నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకుంటామని చెప్పకపోయినా, అమెరికా చర్యలపై పరోక్షంగా విమర్శలు చేశారు.

      దీనితో రష్యా తన సంప్రదాయ వైఖరిని కొనసాగిస్తూ పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

      మధ్యవర్తిత్వానికి సంకేతం

      రష్యా మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. ఇది ఒకవైపు శాంతి ప్రయత్నాలుగా కనిపించినా, మరోవైపు మధ్యప్రాచ్యంలో తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలనే వ్యూహంగా కూడా విశ్లేషిస్తున్నారు. నేరుగా యుద్ధంలోకి వెళ్లే సంకేతం లేదు. ప్రస్తుతం పుతిన్ వ్యాఖ్యల్లో రష్యా నేరుగా యుద్ధంలో పాల్గొంటుందనే సూచనలు లేవు.

      అయితే పరిస్థితులు మరింత దిగజారితే రష్యా తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

      ప్రపంచ ఆర్థిక ప్రభావంపై దృష్టి

      మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఎనర్జీ ధరలు, సముద్ర రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది ఇప్పటికే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నట్లు రష్యా సూచించింది. 

    • 5 March 2026 10:15 AM IST

      బాంబు మోతలతో దద్దరిల్లుతున్న టెహ్రాన్

      ఇరాన్‌లో అర్ధరాత్రి నుండి కొత్తగా దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం అందింది. తూర్పు టెహ్రాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, దీనివల్ల రాజధాని అంతటా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఖచ్చితమైన లక్ష్యాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సనందాజ్, సాక్వెజ్, బుకాన్ వంటి కుర్దిష్ నగరాల్లో కూడా రాత్రిపూట దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. శనివారం నుండి దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.

      అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

      మరోవైపు, ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 19వ విడత ప్రతీకార దాడులను ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపినట్లు అల్ జజీరా పేర్కొంది. గురువారం ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్‌పైకి క్షిపణులను ప్రయోగించింది. దీనివల్ల టెల్ అవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఏడు గంటల విరామం తర్వాత ఈ దాడులు మళ్లీ మొదలయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.

      అదో అడ్డూఅదుపూ లేని దేశం- ట్రంప్

      అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను "నియంత్రణ లేని దేశం" (out of control) గా అభివర్ణించారు. ఇరాన్ ముందుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా నిరోధించడానికే తాము ఈ ముందస్తు దాడులు (pre-emptive strikes) చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్‌పై పటిష్టమైన స్థితిలో ఉందని, ఆ దేశంలో నాయకులు కావాలని ప్రయత్నించే వారు "చనిపోతారని" ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్‌కు చెందిన టాప్ సబ్‌మెరైన్‌తో సహా 20కి పైగా నౌకలను అమెరికా ధ్వంసం చేసినట్లు వైట్ హౌస్ ప్రతినిధి ధృవీకరించారు.

      ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాటల్లో:

      "మేము యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేశాంం, కానీ అమెరికా-జియోనిస్ట్ దురాక్రమణ వల్ల మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామని, ప్రాంతీయ భద్రత సామూహిక ప్రయత్నాల ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

    • 5 March 2026 8:42 AM IST

      అమెరికాను గంగవెర్రులెత్తిస్తున్న షహీద్ డ్రోన్లు

      ఇరాన్ వద్ద ఉన్న వందలాది షహీద్‌ డ్రోన్లు ఇప్పుడు అమెరికాను కలవరపెడుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఈ డ్రోన్లతో దాడులు చేస్తోంది. వాటిని అడ్డుకునేందుకు అమెరికా, మిత్రదేశాలు ఖరీదైన ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం కలిగేలా.. రూ.వేల కోట్ల విలువైన కీలక రాడార్లు, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడంపై ఇరాన్‌ దృష్టిపెట్టింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా టెక్‌ సంస్థల డేటా సెంటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

      యుద్ధం తొలిదశలో వాడకూడదన్న ఉద్దేశంతో తామింకా అసలైన ఆయుధాలను బయటికి తీయలేదని ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ అలీ లరిజని ఇటీవల ప్రకటించడం గమనార్హం. తమ వద్ద ఉన్న ఆయుధాల్లో ఇప్పుడు ప్రయోగిస్తున్నవన్నీ తుప్పుపట్టినవేనని, అసలైన ఆయుధాలను కీలక దశలో ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు.

      ఐఆర్‌జీసీ కమాండర్‌ జబ్బారీ కూడా దాదాపు ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా వద్ద ఉన్న క్షిపణుల నిల్వలు తరిగిపోయే దాకా డ్రోన్లతో దాడులు కొనసాగించి.. ఆ తర్వాత భారీ స్థాయిలో క్షిపణుల ప్రయోగానికి దిగాలని ఇరాన్‌ భావిస్తోందన్న దానికి ఈ ప్రకటనలు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.

    Read More
    Next Story