
'కుబేర': అదిరిపోయే కలెక్షన్స్…
అదిగో అక్కడే అసలైన మలుపు.
ఇప్పుడు ఎక్కడ చూసినా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "కుబేర" సినిమానే హాట్ టాపిక్. ముఖ్యంగా ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ సినిమా గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఒక సినిమా గురించి అంత స్థాయిలో చర్చ జరగడం అంటేనే… అది ఏదో ఒక విధంగా ఆడియెన్స్‌ను రీచ్ అయిందని అర్థం. కానీ ఈ చర్చ ఎక్కువగా పాజిటివ్ కాకుండా నెగెటివ్ వైపే మొగ్గుతున్నదంటే… అదిగో అక్కడే అసలైన మలుపు.
వీకెండ్ దాటినా సినిమా కలెక్షన్స్ బాగున్నాయని నిర్మాతలు సంతోషపడుతున్నారు.
కానీ మరోవైపు, ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్‌గా కొనసాగుతున్న చర్చ మాత్రం టీమ్‌ను ఆలోచనలో పడేసేలా చేస్తోంది.
ఇంకొంతమందికి మాత్రం, ఈ విభిన్న స్పందనలు సినిమాపై క్యూరియాసిటీ పెంచి — “ఏం విషయంలో నెగెటివ్ టాక్ వస్తోంది?” అనే ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ వ్యత్యాసానికి కారణాలేంటి?
ఆడియెన్స్ అసంతృప్తి ఏ దశలో మొదలైంది?
అనుకున్నంతగా ఎందుకు ఆకట్టుకోలేకపోయింది?
మనం ఓ డీప్ సినిమా పక్కాగా అర్థం చేసుకోలేకపోయామా?
లేక… సినిమా మనల్ని టచ్ చేయలేకపోయిందా?
🔴 ఎమోషన్ అనేది సినిమా కరెన్సీ
“The people doesn’t remember what happened. They remember how they felt.”
— Maya Angelou
ప్రతీ సినిమాకు ఇది వర్తిస్తుంది. చూసేవాళ్లు ఎప్పుడూ తెరపై ఏం జరిగిందనేదాని కన్నా, తాము చూసిన క్షణంలో ఏం ఫీలయ్యామనేదే గుర్తుపెట్టుకుంటారు. అలాగే "కుబేర" కథలో డబ్బు, కుట్ర, శక్తి పోరాటం వంటి అంశాలున్నా, వాటి వెనుక ఉన్న భావోద్వేగ బలాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే స్దాయిలో అనుభవించలేకపోయారు. గతంలో శేఖర్ కమ్ముల సినిమాల్లో కనిపించే న్యాచురల్ ఎమోషనల్ టోన్‌కి ఈ సినిమాలో కొంత దూరం ఉందనేది నిజం. ముఖ్యంగా నాగార్జున పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నా, అతని లోపలి కోపం, బాధ, తపన — ఇవి స్పష్టంగా కమ్యూనికేట్ కాలేదని అనిపించింది.
🔴 క్లైమాక్స్ లో ప్రేక్షకుడు తృప్తి చెందలేదా?
కథ ఎక్కడ మొదలైందో తెలుసుకున్న ప్రేక్షకుడు, దాని ముగింపు చూసి "ఆహా!" అనాలి. కానీ "కుబేర"లో క్లైమాక్స్ హడావుడిగా, ఓ సింపుల్ డిస్క్లోజర్తో ముగిసిపోయింది.
ఇది ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా నిలబడాలంటే, క్లైమాక్స్‌లో ఒక "Cinematic Release" అవసరం — అది కనపడ లేదు.
అలాగే థ్రిల్లర్ నేరేషన్ కథలకు ...అర్థం ఉన్న క్లైమాక్స్ కంటే, ఆశ్చర్యపెట్టే క్లైమాక్స్ ముఖ్యం.
కుబేరలో, నాగార్జున ఒక మారిన మనిషిగా బయట పడతాడు. కానీ ఆ మార్పు యాత్రను మనం చూడలేదు, కేవలం వినిపించాం. అది సినిమా నారేషన్ లో ఓ సమస్య. ఈ తరహా కథలకు "లాస్ట్ పంచ్" అవసరం. కాని ఇది ఒక పుస్తకమంలో ముగిసిన పాఠంలా అయింది.
🔴 “Feel is not a layer, it’s the soul of a story.”
ఈ సినిమాలో పాత్రలు మాట్లాడతాయి కానీ మన హృదయాన్ని తాకవు.
నాగార్జున పాత్రలో ఉన్న guilt – redemption arc సరైన రీతిలో రావలేదు.
ధనుష్ పాత్రలో ఉన్న కోపం ఓ సీన్లో పరాకాష్టకి వెళ్లాల్సింది, కానీ అది పరిణతి చెందిన protest లా అనిపించలేదు. ఈ రెండూ కలిసే క్లైమాక్స్‌కి హై ఇవ్వాల్సింది — అదే లేదు.
🔴 డైలాగ్స్ థాట్స్ లా ఉండే మాటలు – కానీ జీవితాన్ని చూపించలేవు
శేఖర్ కమ్ముల ప్రత్యేకత – నేచురల్ డైలాగ్స్. కానీ ఈసారి, రచన కాస్త స్క్రిప్టెడ్‌గా, మోరల్ లెస్సన్స్ చెప్పే టీచర్ లా అనిపించింది. ముఖ్యంగా విజయం, ధనం, ధర్మం,పలుకబడి గురించి అదిరిపోయే డైలాగ్స్ ఉన్నా, అవి మన జీవితాన్ని ప్రతిబింబించలేవు. ఇది తెలివితో రాసిన స్క్రిప్ట్, కానీ జీవంతో రాయలేదు అనే విమర్శలు ఉన్నాయి.
🔴 స్క్రీన్ ప్లే: స్లో బర్న్... కానీ స్పార్క్ లేకుండా
"స్లో బర్న్" సినిమాలు ఆకట్టుకోవాలంటే, అక్కడ ఏమీ లేదనే స్థితిలో కూడా ఆసక్తిని పంచాలి. కుబేర screenplay పరిస్థితి – neither gripping nor introspective. ఒక్కొక్క చోట థ్రిల్లింగ్ కలరింగ్ ఉన్నా, అది లెంగ్త్ పొడవు లో పలచబడిపోయింది. ఇంటర్వెల్ పాయింట్, investigative angle వంటి అంశాలు engaging అయినా… సినిమా ధర్డ్ యాక్ట్ లో ఆ పేస్ sustain కాలేదు.
🔴 “వాహ్ ఫ్యాక్టర్” లేకపోవడం
“The ‘Wow’ factor is not a scene... it’s a feeling. It’s when a film makes you forget you’re watching one.”
— Denis Villeneuve (Director of Dune, Prisoners)
సినిమా అనేది కేవలం కథ కాదు. అది ఒక అనుభవం. ఆ ఎక్సపీరియన్స్ లో ఒక్క సన్నివేశం, ఒక్క డైలాగ్, ఒక్క ఎమోషనల్ హైపాయింట్ అందరినీ షాక్‌కు గురిచేస్తే, అదే "వాహ్ ఫ్యాక్టర్". కానీ “కుబేర” సినిమాలో ఆ wow moment మిస్సయిందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు.
అలాగే సినిమాలో కొన్ని విలక్షణమైన ఎలిమెంట్స్ ఉన్నా —అవి బాగా బలపడకపోవడంతో ప్రేక్షకుడు ఓ ఆశతో వెళ్లి, సాధారణమైన కంటెంట్‌తో బయటకు వచ్చాడు.
🔴 సోషల్ మీడియా ట్రోలింగ్!
ఈ జనరేషనలో OTT-age audience పెద్ద మొత్తంలో పెరిగారు. వాళ్లు కంటెంట్ లో లాజిక్ వెతుకుతున్నారు. వారికోసం సినిమా కేవలం స్టైల్ కాదు — డెప్త్, డైలాగ్, డ్రామా అవసరం. కుబేరలో ట్రైలర్లు హైప్ క్రియేట్ చేసినా, ఫైనల్ మూవీ డెలివరీ డిఫరెంట్‌గా ఉండడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో బిచ్చగాళ్ల మీద ఎక్కువ వెళ్లటం, ఆ డైలాగులు, సీన్స్ ఎక్కవ భాగం ఆక్రమించటం, పదే పదే బిచ్చగాళ్ల ప్రస్తావన థ్రిల్లర్ మోడ్ లో వెళ్లే కథనను సైడ్ ట్రాక్ లోకి తప్పించి, నెగిటివ్ పబ్లిసిటీకి దారితీశాయి.
🔴 సరపడ క్లైమాక్స్ లేకపోవటం
చివరిలో కథ ఒక ఊహించని అద్భుతమైన మలుపు తిప్పుతుందని అనుకునే సమయంలో, అదే మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా పరిష్కారంతో పూర్తవడం... ఈ సినిమా emotional climax కు ఉండాల్సిన weight తక్కువ చేసింది.
🔴 డైరెక్టర్ ఇమేజ్ vs ప్రాజెక్ట్ టోన్ – అవుట్ ఆఫ్ కమ్ముల జోన్
శేఖర్ కమ్ముల అంటే “నేచురల్ ఎమోషన్, స్మాల్ టౌన్ స్టోరీ, మ్యూజికల్ బ్యూటీ” అనే బ్రాండ్. ఈసారి అతను మాఫియా – ఫారిన్ లొకేషన్స్ – స్కామ్ డ్రామా వైపు వెళ్లడంతో, అతడి టైప్ వాచ్ ఫుల్ నెరేషన్ ని ఆశించిన ప్రేక్షకులకి ఇది ఓ గొప్ప ప్రయోగంగా కాక, disconnectగా అనిపించింది.
ఏదైమైనా...
సినిమా చూసిన తర్వాత, "అర్థమవుతోంది… కానీ అనుభూతి లేదు" అనే vacuum తో బయటపడుతున్న ప్రేక్షకులు — అదే సోషల్ మీడియా ట్రోలింగ్‌లోకి మారుతోంది.
అయితే ఇది ఓ ఫెయిల్యూర్ కాదా? కాదు.
ఇది ఒక స్టెప్ బ్యాక్ కాదు — ఒక సైడ్ స్టెప్. ప్రయోగాలకే అవకాశాలు కావాలి. విమర్శలే మార్గదర్శకాలు అవుతాయి. ఈసారి “కుబేర” బహుశా రూపం మార్చిన శేఖర్ కమ్ముల సినిమా కావొచ్చు. కానీ ఆ మార్పు అందరికి జీర్ణించుకునే రీతిలో లేనప్పుడు – నెగిటివ్ టాక్ తప్పదు.
మీ అభిప్రాయం ఏమిటి?
"కుబేర" నిజంగా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని మీరు భావించారా?
లేక ఇది అసలు ఎక్కడ మిస్ అయ్యిందో మీరైమైనా చెప్పగలరా?
👇 మీ కామెంట్ చెప్పండి. Let's talk cinema, beyond the box-office.