
ముస్లిం మహిళలకు దుప్పట్ల పంపిణీపై వివాదం
ముస్లింలకు దుప్పట్లు ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యే
రాజస్థాన్‌లోని మాజీ బీజేపీ ఎమ్మెల్యే, టోంక్ జిల్లాలో ముస్లిం మహిళలకు నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. ముస్లిం మహిళలకు వారి మతం తెలిసిన తర్వాత దుప్పట్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పటికే ఇచ్చిన దుప్పట్లు కూడా తిరిగి తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, ఈ ఘటన ఫిబ్రవరి 23 ఆదివారం మధ్యాహ్నం జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వివాదం తలెత్తింది. ఈ కార్యక్రమాన్ని మాజీ బీజేపీ ఎమ్మెల్యే,మాజీ ఎంపీ అయిన సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా నిర్వహించారు.
మొదట మహిళలకు దుప్పట్లు ఇచ్చిన మాజీ బిజెపి ఎమ్బెల్యే వారి మతం తెలిసిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మతం తెలిసిన తర్వాత ముస్లిం మహిళల నుంచి ఇచ్చిన దుప్పట్లు వెనక్కి తీసుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
‘ప్రధాని మోదీని నిందించే వారు తీసుకునే హక్కు లేదు’
ఒక వీడియో క్లిప్‌లో, ప్రధాని నరేంద్ర మోదీని దూషించే వారికి దుప్పట్లు తీసుకునే హక్కు లేదని జౌనాపురియా బహిరంగంగా చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ కార్యక్రమం తన వ్యక్తిగత కార్యక్రమమని, ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించినది కాదని కూడా ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అజ్మీర్‌కు ఫిబ్రవరి 28న ప్రతిపాదిత పర్యటనకు ప్రజలను ఆహ్వానించడానికి మాజీ ఎంపీ వెళ్లినట్లు సమాచారం.
Next Story

