మదురై కామరాజ్ యూనివర్సిటీలో అవినీతిపై దర్యాప్తు:
x

మదురై కామరాజ్ యూనివర్సిటీలో అవినీతిపై దర్యాప్తు:

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ..


Click the Play button to hear this message in audio format

మదురై కామరాజ్ యూనివర్సిటీలో అవినీతి ఆరోపణలు పెల్లు బికుతున్న నేపథ్యంలో.. మద్రాస్ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. లంచాలు, నకిలీ సర్టిఫికెట్లు, అధిక ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. గతంలో యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల జారీ, అక్రమాలు, దుష్ప్రభావం, సిబ్బంది అధిక ఆస్తుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

కోర్టు ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (DVAC) వైఫల్యాలను తప్పు పట్టింది. జూనియర్ రైటర్‌గా పనిచేసిన గోమతి అనే సిబ్బందిపై నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడం, పత్రాల లీక్ చేయడం, లంచాలు వసూలు చేయడం చోటుచేసుకున్నాయి. ఆమె ఖాతాలో రూ.35 లక్షల డిపాజిట్లు, రూ.2 కోట్ల విలువైన ఇంటి కొనుగోలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2024లో పిహెచ్‌డీ ప్రవేశాలు, మార్కుల మార్పిడి అక్రమాలపై ఆరోపణలు వచ్చినప్పటికీ, యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది.

యూనివర్సిటీలో ప్రభుత్వ నిధుల విడుదల లేకపోవడం, పెన్షన్ సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు వంటి అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి.

Read More
Next Story