విజయవాడలో ’ఖవాతీన్‘ కలకలం
x

విజయవాడలో ’ఖవాతీన్‘ కలకలం

విజయవాడ ఉగ్రవాద లింకుల కేసు.. సైదా బేగం విచారణలో షాకింగ్ నిజాలు.


విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఉగ్రవాద బాట పట్టించడమే లక్ష్యంగా ఆమె ఒక భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు దాదాపు 42 మంది యువతులను ఆమె రిక్రూట్ చేసినట్లు విచారణలో తేలడం భయాందోళనలకు గురి చేస్తోంది.

KHAWATEEN పేరుతో వాట్సాప్ గ్రూపులు
యువతులను జిహాదీ వైపు ఆకర్షించేందుకు సైదా బేగం KHAWATEEN అనే పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసిందని, ఈ గ్రూపులో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వంటి వారి జిహాదీ ప్రసంగాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించే వీడియోలను షేర్ చేస్తూ యువతను మభ్యపెడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేవలం వాట్సాప్ మాత్రమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 40 నకిలీ అకౌంట్ల ద్వారా జిహాదీ వీడియోలను ప్రచారం చేస్తూ నెట్‌వర్క్‌ను విస్తరించిందని పోలీసులు గుర్తించారు.
మదర్సాల్లో శిక్షణ.. వెపన్ ట్రైనింగ్‌కు ప్లాన్
విచారణలో వెల్లడైన మరో భయంకరమైన విషయం ఏమిటంటే, మదర్సాల్లో మతపరమైన శిక్షణ పూర్తయిన తర్వాత, ఎంపిక చేసిన యువతులకు వెపన్ ట్రైనింగ్ (ఆయుధ శిక్షణ) ఇప్పించేందుకు ఆమె సన్నాహాలు చేసిందని, ఇందుకోసం రిక్రూట్‌మెంట్, శిక్షణకు సంబంధించిన భారీ పిడిఎఫ్ (PDF) ఫైళ్లను పోలీసులు ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫైళ్లలో ఉగ్రవాద శిక్షణకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు సమాచారం.
లోతుగా పోలీసుల దర్యాప్తు
ప్రస్తుతం పోలీసులు సైదా బేగం ఫోన్ డేటా, వాట్సాప్ చాట్స్, ఇతర డిజిటల్ సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమెకు దేశీయంగా లేదా విదేశీ ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పటికే రిక్రూట్ అయిన 42 మంది యువతులు ఎక్కడ ఉన్నారు? వారిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
Read More
Next Story