
నిర్మలా సీతారామన్
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం: నిర్మలా సీతారామన్
ట్యాక్స్ నిబంధనల్లో సడలింపులు.. సామాన్యులు సైతం నేరుగా ITR ఫైల్ చేసేలా మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను వ్యవస్థను మరింత సరళతరం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని ఆమె వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా నిబంధనల్లో సడలింపులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటుకు సమర్పించిన కేంద్రబడ్జెట్ లో ఈ విషయాన్ని చెప్పారు.
ప్రజలే నేరుగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేలా వ్యవస్థను మార్చుతున్నామని నిర్మలా తెలిపారు. దీనిలో భాగంగా సరళతరం చేసిన కొత్త ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి అని పేర్కొన్నారు.
జులై 31 వరకు ITR-1, ITR-2 ఫారాలు
ఈ ఏడాది నుంచి సామాన్యులు సులభంగా ఫైల్ చేసుకునే విధంగా ITR-1, ITR-2 ఫారాలు జులై 31 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్‌టైమ్ స్కీమ్
విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాల ప్రకటన కోసం ప్రభుత్వం వన్‌టైమ్ స్కీమ్ తీసుకురానున్నట్లు నిర్మలా ప్రకటించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం కల్పించే చర్యగా భావిస్తున్నారు.
మార్చి 31 వరకు పన్ను చెల్లింపునకు గడువు
ఆదాయపన్ను చెల్లింపునకు గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే సవరించిన రిటర్నుల దాఖలు గడువును కూడా పెంచుతూ, డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
పలు విభాగాల్లో పన్ను సడలింపులు
బడ్జెట్‌లో భాగంగా కొన్ని ముఖ్యమైన పన్ను మినహాయింపులు కూడా ప్రకటించారు.
రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్నును తొలగించారు.
విదేశీ యాత్రలపై విధించే ట్యాక్స్‌ను తగ్గించారు.
విద్య, వైద్య అవసరాలపై టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలకు టీడీఎస్‌ను 1 లేదా 2 శాతంగా నిర్ణయించారు.
చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక పథకం
చిన్న పన్ను చెల్లింపుదారులకు మరింత ఊరట కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
మొత్తంగా ఈ మార్పులు సామాన్యులు కూడా సులభంగా ఆదాయపన్ను రిటర్నులు ఫైల్ చేసుకునేలా, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెంచేలా ఉంటాయని కేంద్రం అభిప్రాయపడుతోంది.
Next Story

