భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాలపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు..
x

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాలపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు..

“రాజకీయ స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వం భారత్‌కు బలం. భారత ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తోందన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి


Click the Play button to hear this message in audio format

భారత్–అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో ఇకపై ఎలాంటి క్లిష్ట అంశాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం వరకు భారీ సుంకాలు విధించడంతో చర్చలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 25 శాతం సుంకం కూడా ఇందులో భాగమే.


‘సానుకూలంగా చర్చలు’

శనివారం హిందూస్తాన్ టైమ్స్ తో మాట్లాడిన గోయల్.. భారత్ గడువు పెట్టుకుని ఒప్పందాలు చేయదని స్పష్టం చేశారు. “ఇది సానుకూలమైన, మంచి ఒప్పందం. మేం చురుకుగా చర్చల్లో పాల్గొంటున్నాం. ఇరు పక్షాలు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే తేదీ ప్రకటిస్తాం. పరిష్కరించాల్సిన క్లిష్ట అంశాలు ఇక లేవని నా అభిప్రాయం. ఇప్పుడు ముగింపు దిశగా వెళ్లవచ్చు” అని వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనందుకు భారత్ అసంతృప్తి వ్యక్తం చేయలేదని కూడా స్పష్టం చేశారు. “ప్రతి దేశం తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది. మన ప్రయోజనాలను మనమే రక్షించుకోవాలి. చర్చలు స్నేహపూర్వకంగానే కొనసాగుతున్నాయి” అని ఆయన టైమ్స్ ఆ ఇండియాతో అన్నారు.


జైశంకర్ అమెరికా పర్యటన ..

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై గోయల్ వ్యాఖ్యల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

యూకే, ఈయూ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలు) గురించి గోయల్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే భారత్‌ ఇప్పుడు గౌరవనీయ దేశంగా ఎదిగిందని గోయల్ అన్నారు. “రాజకీయ స్థిరత్వం, మాక్రో ఆర్థిక స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వం భారత్‌కు బలం. భారత ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తోంది. అందుకే భారత్‌తో వ్యాపారం చేయాలనే ఆసక్తి ఇతర దేశాల్లో పెరిగింది” అని తెలిపారు.

ఇకపై భారత్ బలమైన స్థితి నుంచి, ఆత్మవిశ్వాసంతో చర్చలు జరుపుతోందని గోయల్ పేర్కొన్నారు. “భవిష్యత్ ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి. గతం ముఖ్యం కాదు. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లు; 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. అదే మన బలం. అందుకే సమాన స్థాయిలో లేదా ఇవ్వడానికి ఎక్కువ ఉన్న దేశంగా చర్చలు జరిపి, ఉత్తమ ఒప్పందాలు సాధిస్తున్నాం” అని అన్నారు.

Read More
Next Story