
టిటిడి నుంచి ఇవొ అనిల్ కుమార్ సింఘాల్ అకస్మిక బదిలీ
తిరుమల నెయ్యి కల్తీ విచారణ పర్యవసానమేనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లుండి తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ని అదివారం నాడు బాధ్యతలనుంచి తొలగించింది. మరొక చోటికి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని అదేశించింది. తక్షణం విధులనుంచి తప్పుకోవాలని, ఆదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పిగించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా ఉన్న ముద్దాడ రవిచంద్రనితాత్కాలిక ఇవొ గా నియమించింది. సింఘల్ 1993 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇంత అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డుల తయారీలో జంతువుల కొవ్వులు కలిపానరి 2024 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ మీద దానికి సుప్రీంకోర్టు నియమించిన స్పెఫల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు ముగిసి చార్జ్ షీట్ ను కోర్టు కు సమర్పించగానే సింఘాల్ ని బయటకు పంపించడం జరిగింది. తిరుమలకు కొన్ని కంపెనీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని అయితే, జంతువులు కొవ్వులతో కల్తీ జరగలేదని సిట్ తేల్చింది. నెయ్యిలో పంది కొవ్వు, ఫిష్ అయిల్ వంటి విలేవని, కేవలం పామోలిన్ ఆయిల్, పామ్ కెర్నెల్ అయిల్ మాత్రమే ఉన్నాయని సిట్ చెప్పింది. ఇది చంద్రబాబుకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
అసలు సింఘాల్ ని చంద్రబాబు నాయుడు రెండోెసారి టిటిడి ఇవొగా ఎలా నియమించారనేది ప్రశ్న. ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి కాలంలో కొద్ది కాలంలో ఇవొగా పనిచేసినా, ఆయన కాలంలోనే కల్తీనెయ్యి కుంభకోణం జరిగినా అవన్నీ ఖాతరు చేయకుండా శ్యామల్ రావు ను తొలగించి రెండో సారి 2025 సెప్టెంబర్ లో ఎలా నియమించారనేది ప్రశ్న. దీనికి కారణం సింఘాల్ కు జాతీయ స్థాయిలో కనెక్షన్ లేకారణమని చెబుతారు.
సిట్ దర్యాప్తులో అనిల్ కుమార్ సింఘాల్ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి టిటిడికి సరఫరా అవుతున్నపుడు ఇవొ గా ఉన్న సింఘాల్ దీనిని గుర్తించడం విఫలమయ్యాడని సిట్ నివేదికలోపేర్కొంది. ఇవొ గా ఉన్నపుడు సింఘాల్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోయాడని, కేవలం నాటి బోర్డు నాయకత్వానికి వత్తాసు పలికాడని సిట్ కామెంట్ చేసిందని, ఆయన మీద డిసిప్లీనరీ యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి రాసిందని తెలిసింది.
సిట్ వ్యాఖ్యలే సింఘాల్ అకస్మిక బదిలీకి కారణమని పరిశీలకు భావిస్తున్నారు.
సింఘాల్ మొదటి సారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 2017 మేన టిటిడి ఇవొగా నియమితులయ్యారు.తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా 2020 అక్టోబర్ వరకు కొనసాగారు.

