క్రికెట్ స్టార్
x
ఇండియా, జింబాబ్వే క్రికెట్ స్టార్స్

భారీ విజయం దిశగా ఇండియా, జింబాబ్వే లక్ష్యం 257 రన్స్

జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది.


టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది. బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన భారత్, ఇప్పుడు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని కట్టడి చేస్తూ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది.

పరుగుల సునామీ.. రికార్డుల వేట

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • అభిషేక్ శర్మ (55) మెరుపు హాఫ్ సెంచరీతో పునాది వేయగా..

  • చివరలో హార్దిక్ పాండ్య (23 బంతుల్లో 50)* సిక్సర్ల వర్షం కురిపించి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

  • తిలక్ వర్మ (44)* తో కలిసి పాండ్య ఐదో వికెట్‌కు అజేయంగా 84 పరుగులు జోడించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. (తొలి స్థానం: 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260/6).

    రెండో వికెట్ కోల్పోయిన జింబావ్వే..

    257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు మరుమాని, బ్రియాన్ బెనెట్ నిలకడైన ఆరంభాన్ని ఇచ్చారు. రింకు సింగ్ క్యాచ్ జారవిడచడంతో ప్రాణవాయువు పొందిన మరుమాని (20), చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుత పరిస్థితి: జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పరుగుల వేగం తగ్గింది.

  • జింబాబ్వే స్కోరు: 73/1

  • క్రీజులో: రజా (1*), బ్రియాన్ బెనెట్ (43*)

Read More
Next Story