ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి కిందట ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రసవత్తరంగా సాగుతోంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో మరికొద్ది సేపట్లో తేలనుంది. భారత్ దక్షిణాఫ్రికాకి 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మహిళల ప్రపంచ కప్ 2025(Women's World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్(Mithali Raj) పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కొంత ఆలస్యమైనా, అభిమానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. డివై పాటిల్ స్టేడియం (నవి ముంబై)లోని ప్రేక్షక గ్యాలరీలన్నీ నిండిపోయాయి. “ఇండియా... ఇండియా…” నినాదాలతో మార్మోగింది.
సెమీ ఫైనల్లో జెమిమా మ్యాజిక్..
ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్లో భారత జట్టు చూపిన ఆటతీరు అద్భుతమని క్రికెట్ ప్రపంచం ప్రశంసించింది. జెమిమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) ధాటిగా ఆడగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సమర్థంగా నడిపించారు. ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా మిగిలింది.
సౌతాఫ్రికా సత్తా..
ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ లో ప్లేస్ దక్కించుకున్న సౌతాఫ్రికా జట్టును కూడా తేలికగా తీసుకోలేమని ఇప్పటి వరకు జరిగిన పోటీలను చూస్తుంటే తెలుస్తోంది.
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నడీన్ డి క్లర్క్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలాన్నిస్తోంది. ఇరు జట్లూ ఇప్పటివరకూ వన్డే వరల్డ్‌కప్ గెలవకపోవడంతో ఈసారి ఎవరు కొత్త చాంపియన్‌గా నిలుస్తారో చూడాలి అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
మ్యాచ్ ప్రారంభం నుంచే బౌలర్లు పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుండగా, బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదట నెమ్మదిగా ఆరంభించి ఇన్నింగ్స్ కట్టడిపై దృష్టి పెట్టింది. స్మృతి మందనా, షఫాలి వర్మ జాగ్రత్తగా ఆచి ఆరంభించగా, మధ్యలో హర్మన్‌ప్రీత్, జెమిమా జోడీ మళ్లీ జోరందించింది.
భారత జట్టుకు చారిత్రాత్మక అవకాశం
ఇప్పటివరకు భారత్ మహిళల జట్టు రెండు సార్లు (2005, 2017) ఫైనల్ ఆడినప్పటికీ టైటిల్ అందుకోలేకపోయింది. ఈసారి మాత్రం జట్టు సమతుల్యంగా ఉంది. యువ ఆటగాళ్ల దూకుడు, సీనియర్ల అనుభవం కలిసిన సమయమిది. విజయం దక్కితే, ఇది భారత మహిళల క్రికెట్‌కు చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.
ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న క్రీజులో ఉన్న షఫాలీ నిలకడగా ఆడుతున్నారు. 17 ఓవర్లకు 97 పరుగులు చేశారు. ఆ తర్వాత ఓవర్ లో వికెట్ పడిపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ జెమిమా క్రీజ్ లోకి వచ్చారు. స్కోర్ పెరుగుతోంది.