
నటుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
పబ్ లో జరిగిన చిన్న గొడవ డ్రగ్స్ నెట్ వర్క్ బయట పడేలా చేసిందా?
డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీకాంత్ ఎలా చిక్కాడంటే..
మహాలింగం పొన్నుస్వామి
తమిళ నటుడు శ్రీకాంత్ ను సోమవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ రవాణా కేసులో ఆయన ప్రమేయం ఉందని ఆధారాలు దొరకడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో జరిపిన దాడిలో 1 గ్రాము కొకైన్ లభించడం తో పాటు మాదకద్రవ్యాల రక్త పరీక్షలో పాజిటివ్ గా వచ్చింది.
ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన టీ. ప్రసాద్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ తో సంబంధం పెట్టుకుని 40 సార్లకు పైగా కొకైన్ ఆర్డర్ ఇచ్చాడు. దీనికోసం రూ. 4.72 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని పోలీస్ విచారణలో ప్రదీప్ కుమార్ అంగీకరించాడు.
చిన్న గొడవ.. దర్యాప్తుకు దారి
నటుడి గురించి సమాచారం అందడంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఎగ్మోర్ లోని 14వ మెట్రోపాలిటన్ క్రిమినల్ మేజిస్ట్రేట్ దయాలన్ ముందు హజరుపరిచారు.
ఆయనకు జూలై 7 వరకూ జ్యూడిషియల్ కస్టడీ విధించారు. కస్టడీ అనంతరం శ్రీకాంత్ ను ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆయనను ఫస్ట్ క్లాస్ జైలు గదిని కేటాయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
మే 22న నుంగంబాక్కం బార్ లో జరిగిన ఘర్షణ తరువాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో శ్రీకాంత్ వివరాలు లభ్యం అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో వ్యాపారవేత్తను మోోసం చేసిన జాబ్ రాకెట్ తో సహ పలు మోసపూరిత కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రసాద్ తరువాత మాదకద్రవ్యాల కేసులో కీలక డాన్ గా ఎదిగాడు. అతని ఫోన్ కాల్ రికార్డుల విశ్లేషణలో కొకైన్ స్మగ్లింగ్ నెట్ వర్క్ ను నడుపుతున్నట్లు వెల్లడైంది. ఇది మరిన్ని అరెస్ట్ లకు కారణమైంది.
డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్..
జూన్ 17న యాంటీ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు నుంగంబాక్కం పోలీసులు సేలంలోని శంకరికి చెందిన 38 ఏళ్ల ప్రదీప్ కుమార్ అలియాస్ ప్రాడో, 38 ఏళ్ల ఘనా జాతీయుడు జాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నుంగంబాక్కం వాతావరణ పరిశోధన కేంద్రం బస్ స్టాప్ సమీపంలో 11 గ్రాముల కొకైన్, రూ. 40 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్ లతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. తరువాత ప్రత్యేక పోలీస్ బృందం వారిని విచారణ కోసం చెన్నైకి తరలించింది.
విచారణలో ప్రదీప్, ప్రసాద్ కు కొకైన్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. గత నెలలో దానికి పబ్ ల్ శ్రీకాంత్ కు దానిని విక్రయించాడు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రదీప్ బెంగళూర్ నుంచి జాన్ ద్వారా కొకైన్ ను గ్రామును రూ. 7 వేలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ. 12 వేలకు విక్రయిస్తున్నాడు.
శ్రీకాంత్, దాదాపు 40 సార్లు తన నుంచి కొకైన్ కొనుగోలు చేశాడని, గూగూల్ పే ద్వారా రూ. 4.72 లక్షల లావాదేవీలు నెరిపాడని చెప్పారు.
సినిమా పార్టీలోనూ..
ప్రదీప్ వెల్లడించిన తరువాత జూన్ 23న నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలోని నటుడు శ్రీకాంత్ ఇంట్లో పోలీసులు సోదా నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక గ్రాము కొకైన్, మూడు ఖాళీ ప్యాకెట్లు లభించాయి.
దీనితో ప్రదీప్ చుట్టూ ఉచ్చు బిగిసింది. విచారణ నిమిత్తం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చిత్ర నిర్మాణ సమయంలోనూ ప్రసాద్ పార్టీలను నిర్వహించాడని, అక్కడ కూడా కొకైన్ సరఫరా చేసేవాడని పోలీస్ వర్గాలు తెలిపాయి.
చెన్నై అంతటా పబ్ లు, బార్ లలో తరుచుగా జరిగే బార్ లో గంజాయి, ఓజీ, కొకైన్ వంటి వాటి సరఫరా జరుగుతుందని తెలిసింది.
దర్యాప్తు జరుగుతోంది
ఐదు సంవత్సరాల నుంచి ప్రదీప్ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూర్ లో ఓ ప్రయివేట్ కాలేజీ ఉద్యోగి లింగేశ్వరన్, ఘనా జాతీయుడు జాన్ నుంచి కొకైన్ సేకరించి విక్రయించడం ప్రారంభించాడు.
మొదట స్నేహితులతో కలిసి వినోదం కోసం డ్రగ్స్ ను ఉపయోగించిన ప్రదీప్, తరువాత వ్యాపారం కూడా ప్రారంభించాడు. జాన్ తో సంబంధం వల్ల పెద్ద మొత్తంలో కొకైన్ సేకరించేవాడు. తరువాత సమాజంలో ఉన్నత వర్గాల వారికి పంపిణీ చేయడం ప్రారంభించాడు.
కమిషనర్ ఏ అరుణ్ ఆదేశాల మేరకు చెన్నై పోలీసులు నగరంలోని మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్ వర్క్ ను నిర్మూలించడానికి ప్రయత్నాలుు ముమ్మరం చేశారు. సిండికేట్ తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
కీలక అంశాలు..
ఈ కేసులో ఇంకా హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారా పోలీసులు దృష్టిసారించారు. మాదక ద్రవ్యాల వినియోగం, తరుచుగా వాటిని ఎక్కడ సేకరించేవాడు, పబ్బుల పార్టీలు, ఆయన నుంచి సినీ పరిశ్రమలోని ఇతర వ్యక్తులకు ఏమైనా చేరాయా? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శ్రీకాంత్ బ్యాంకు ఖాతాలు, ప్రసాద్ తో జరిపిన లావాదేవీలు బయటకు తీస్తున్నారు. మరో నటుడు కృష్ణ కూడా కొకైన్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం కేరళలో ఉన్నాడు. అతడికి కూడా నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
Next Story