
శ్రీవారి లడ్డు:'స్వామీ' ఇలా జరిగిందేమీ..? నెయ్యిపై కమిషన్ ముందడుగే
BJP నేత సుబ్రమణ్యస్వామికి ఎదురుదెబ్బ
శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి ఆరోపణలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇదే అంశంపై 18 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణను సవాల్ చేసిన స్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఇది వైసీపీకి పరోక్షంగా షాక్ ఇచ్చినట్లే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టడానికి లైన్ క్లియర్ అయ్యింది.
"రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ను నియమించే అధికారం ఉంది" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో పాటు పరిపాలన లోపాలు, బాధ్యతలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ నియమించే అధికారం ఉంది" అని చేసిన వ్యాఖ్యలు టీడీపీ కూటమికి మరింత బలమ చేకూర్చినట్లు కనిపిస్తోంది.
సీబీఐ ఇది విచారణ
తిరుమల లడ్డు లో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ (CBI) సారథ్యంలోని సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ చేసిన అనంతరం సిబిఐ నెల్లూరు ఏసీబీ కోర్టులో జనవరి 21వ తేదీ సుమారు 600 పేజీల చార్జి షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2024 సెప్టెంబర్ 18 తేదీ ఆరోపించినట్లు" నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు (Beef fat) కారకాలు లేవని" నివేదికలో ప్రస్తావించడంతో వైసిపి మాటలు రాటుదేలాయి. టిడిపి కూటమికి సిబిఐ నివేదిక మింగుడు పడని పరిస్థితిని కల్పించింది.
ఏకసభ్య కమిషన్ ఎందుకంటే
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ అనే వ్యవహారం నెగ్గు తేల్చాలని టిడిపి కూటమి ప్రభుత్వం సంకల్పించింది. లడ్డు తయారీకి నెయ్యి కొలుగోలు, టిటిడి పర్చేజింగ్ కమిటీ వ్యవహారాలన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సారధ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా నిర్దిష్ట గడువు విధించింది.
కారణం ఏమిటంటే..
తిరుమల లడ్డు కల్తీ నెయ్యిలో నిందితులను గుర్తించడం ఒకటి. వైసీపీ పాలనలో తప్పులు జరిగాయి. అనే విషయాలను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంగా కమిషన్ ఏర్పాటు వెనుక ఉద్దేశంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. సిబిఐ నివేదికలో కొవ్వు మూలాల ప్రస్తావనతో పాటు ఆర్థిక మూలాలకు సంబంధించి హవాలా వ్యవహారాలను కూడా స్పర్శించలేదు. ఈ అంశాలపైనే టిడిపి కూటమి అసంతృప్తిగా ఉంది.
"ఈ రెండు అంశాలు cbiకి కనిపించలేదా" అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మీడియా ముందు బాహటంగానే విమర్శలు గుప్పించారు. నిందితులను గుర్తించే వరకు వదిలేది లేదని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు 2024 సెప్టెంబర్ నెలలో ఏం జరిగింది అనేది ఒకసారి పరిశీలించాలి.
ముఖ్యమంత్రి కదిపిన తుట్టె...
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యలో కల్తీ చేశారు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసింది. దీనిపై గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠీ సారథ్యంలో సిట్ ( special investigate your team SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ మూడు రోజులు విచారణ చేసి నివేదిక సమర్పించే నేపథ్యంలో..
తమిళనాడులోని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ సారధ్యంలో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఆ కమిటీలో ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా సభ్యులుగా ఉండాలి" అని ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. ఈ కమిటీ ఏర్పాటులో టిటిడి మాజీ చైర్మన్ వై వి. సుబ్బారెడ్డి తో పాటు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో సీబీఐ అధికారులు 15 నెలల పాటు 21 రాష్ట్రాల్లో విచారణ చేసి, నెల్లూరు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సారథ్యంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు అయింది.
స్వామి మళ్లీ పిటిషన్..
తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో వైసిపి నాయకులు రోజుకో ఆ స్థలాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా టిడిపి కూటమిని ఇరుకునపెట్టే ప్రయత్నంలో సఫలమవుతున్నారని భావిస్తున్నారు. ఇదే సమయంలో జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ స్పందించారు. ఆయన స్పందనతో వైసీపీకి మరింత బలం లభించినట్లు అంచనా వేశారు.
"రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు" ఈ పిటీషన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, సిట్, సిబీఐ తోపాటు టీటీడీని కూడా ప్రతివాదులుగా చేర్చారు.
తిరుమల లడ్డుపై పూర్తిస్థాయిలో విచారణ చేసిన సిబిఐ సారధ్యంలోని కమిటీ నివేదిక సమర్పించాక మళ్లీ ఏకసభ్య కమిషన్ అవసరం ఏమిటి అనేది సుబ్రహ్మణ్యం స్వామి వాదన.
సుప్రీం కోర్టు మూడు రోజుల తరువాత సోమవారం ఈ పిటిషన్ పై విచారణకు తిరస్కరించడం బీజేపీ (BJP) సుబ్రమణ్యస్వామికే కాకుండా వైసిపికి షాక్ తగిలినంత పని అయినట్లు రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తున్నారు.
Next Story

