
రాష్ట్రాభివృద్ధిలో దూకుడుకు ఊతం ఇచ్చారు..
కేంద్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ సహకరించే విధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"కేంద్ర బడ్జెట్లో తొలిసారిగా లాజిస్టిక్ రంగం అభివృద్ధిపై ప్రస్తావించడం" స్వాగతించతగినదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2026- 27 ఆర్థిక సంవత్సరాలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు.
"కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్" ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను ఆయన అభినందించారు.
"రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాలకు కేంద్ర బడ్జెట్ మరింత బలం ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత దూకుడుగా వెళ్ళేందుకు 2026 - 27 బడ్జెట్ సహకరించేదిగా ఉంది" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.
"రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజా ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. తాజా బడ్జెట్ వల్ల వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది" అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించే దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని. 2047 నాటికి వికసిత భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహా, వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్ కు తీసుకొని వెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రేట్ నేషన్ దిశగా ఈ బడ్జెట్ పయనం సాగించడంలో మరింతగా ఉపయోగపడుతుందని ఆయన అభివర్ణించారు.
"స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు మద్దతు తెలిపారు. ఈ కేటాయింపులు ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు ఏజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హై స్పీడ్ రైళ్లు
హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై హై స్పీడ్ రైల్ ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో ఆధ్యాత్మిక నగరం తిరుపతి తో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి వంటి ప్రాంతాలు కూడా ఈ హై స్పీడ్ కారిడార్ లో కవర్ చేయడం అనేది రాష్ట్రానికి ఒక అసెట్ అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరు నుంచి చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయని అన్నారూ. రైల్వే వ్యవస్థను ఇదొక పెద్ద అభివృద్ధికి మార్పు అని ఆయన కిఅన్నారు.
ఐటీకి ఊతం...
రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో అత్యంత విలువైన భారత ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగించే అవకాశం ఉన్నందువల్ల రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మరింత పూర్వ అభివృద్ధి దిశగా సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"డేటా సెంటర్లకు పనులు మినహాయింపు 2047 వరకు ఇవ్వడం" దేశం సాంకేతిక రంగంలో మరింత వేగంగా పయనిస్తుందని ఆయన అన్నారు.
"ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్కు 40 వేల కోట్లు కేటాయించడం దీనికి. నిదర్శనం" అని కేంద్ర బడ్జెట్ను ఆయన స్వాగతించారు. భారతదేశం డేటా సెంటర్లకు ఓ హబ్ గా తయారవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలపెట్టిన విశాఖ పట్టణం గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు కూడా వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భూతం ఇచ్చేలా ఈ డేటా సెంటర్లో తయారవుతాయని చెప్పారు దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రహించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
టెక్స్టైల్ సెక్టార్కు కూడా కేంద్ర ప్రభుత్వం ఊతమిచ్చిందని ఇది రాష్ట్రానికి మరింతగా ఉపకరిస్తుందని ఆయన వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ఊతం ఇచ్చిందని ఆయన చెప్పారు. అరకు ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని, కొబ్బరి, జీడి పరిశ్రమతో పాటు చందనం లాంటి పంటలకు కూడా భూతం ఇవ్వడం అనేది రైతులకు వరం లాంటిదిని ఆయన అభివర్ణించారు.
Next Story

